Anil Ravipudi: సెప్టెంబరులో బాలయ్యతో

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ, అనిల్‌ రావిపూడిల కలయికలో రూపొందే సినిమా సెప్టెంబరులో మొదలు కానుంది.

Updated : 20 Apr 2022 14:18 IST

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ, అనిల్‌ రావిపూడిల కలయికలో రూపొందే సినిమా సెప్టెంబరులో మొదలు కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం, చిలుకూరివారిపాలెంలో తన స్వగృహానికి వచ్చిన ఆయన ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. ‘‘బాలకృష్ణతో సెప్టెంబరులో సినిమా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాను. బాలయ్య- బోయపాటి అంటే ఓ మార్క్‌ ఉంది. వారి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్‌ హిట్టే. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణ ఇప్పటి వరకు చేయని పాత్రను సృష్టిస్తున్నాం. అభిమానులకు గుర్తుండిపోయేలా నూతన గెటప్‌ ఉంటుంది. అవసరమైతే బాలయ్యబాబును మా స్వగ్రామం చిలుకూరివారిపాలెం తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. కరోనా థర్డ్‌ వేవ్‌ నుంచి బయటపడ్డాం. దేవుడి దయవల్ల భవిష్యత్తులో కరోనా మహమ్మారి విజృంభించకుంటే తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా గాడినపడినట్లే. మే 27న ‘ఎఫ్‌-3’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ నటన ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వేగంగా సాగుతోంది.

- న్యూస్‌టుడే, యద్దనపూడి, మార్టూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని