Anjali: న్యాయ విద్యార్థిగా అంజలి
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ లాంటి చిత్రాలతో మెప్పించిన అచ్చ తెలుగు కథానాయిక అంజలి. తన యాభయ్యో సినిమా ‘ఈగై’లో న్యాయ విద్యార్థిగా కనిపించనుంది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ లాంటి చిత్రాలతో మెప్పించిన అచ్చ తెలుగు కథానాయిక అంజలి (Anjali). తన యాభయ్యో సినిమా ‘ఈగై’లో న్యాయ విద్యార్థిగా కనిపించనుంది. ‘సామాజిక న్యాయం కథాంశంతో.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా కనిపించనుంది. జూన్ 9నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది’ అని దర్శకుడు అశోక్ వేలాయుధన్ వివరాలు ప్రకటించారు. చెన్నై, ముంబయి నగరాల్లో చిత్రీకరణ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో సునీల్ ప్రతినాయకుడి పోషించనున్నారు. ధరణ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, శ్రీధర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. అంజలి ప్రస్తుతం అగ్ర దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్