Updated : 04 Jul 2022 07:39 IST

Anjali: అంజలి అందం ప్రత్యేకం

‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) గ్లామర్‌ హంగులతో కళకళలాడనుంది. కథానాయిక అంజలి (Anjali) అందం మరింత ప్రత్యేకం కానుంది. నితిన్‌ (Nithiin) కథానాయకుడిగా ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(Rajasekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్‌ (Catherine) కథానాయికలు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ  సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉంటుంది. ఆ పాటలో అంజలి ఆడిపాడారు. త్వరలోనే పాటని విడుదల చేయనున్నారు. ‘‘రాజకీయ అంశాలతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. నితిన్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా సందడి చేయనున్నారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకి అంజలి ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్‌ లో వేసిన ఓ భారీ సెట్‌లో ఆ పాటని తెరకెక్కించామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, మాటలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేష్‌, కూర్పు:  కోటగిరి వెంకటేశ్వరరావు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని