రజనీ అభిమానులు.. సిద్ధంకండి

ఎట్టకేలకు రజనీకాంత్‌ అభిమానులకు తీపికబురు వచ్చింది. ఆయన నటిస్తున్న ‘అన్నాత్తె’ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈసారి ‘అన్నాత్తె’ తెచ్చే దీపావళికి సిద్ధమవండి అంటూ చిత్ర నిర్మాణసంస్థ ఓ ట్వీట్‌ చేసింది. ఈమధ్య రాజకీయ ప్రవేశం చేస్తానంటూ ప్రకటించిన రజనీ..

Published : 26 Jan 2021 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎట్టకేలకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు ఓ తీపికబురు వచ్చింది. ఆయన నటిస్తున్న ‘అన్నాత్తె’ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈసారి ‘అన్నాత్తె’ తెచ్చే దీపావళికి సిద్ధమవ్వండి అంటూ చిత్ర నిర్మాణసంస్థ ఓ ట్వీట్‌ చేసింది. ఈమధ్య రాజకీయ ప్రవేశం చేస్తానంటూ ప్రకటించిన రజనీ.. కొంతకాలానికే అందుకు విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కాగా.. మళ్లీ ఈ సినిమా విడుదల వార్తతో వాళ్లకు కొంత ఉపశమనం కలిగినట్లయింది.

ఇటీవల రజనీకి కరోనా సోకడంతో చిత్రీకరణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డైరెక్టర్‌ సిరుతయి శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్‌ కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, ఖుష్భూ, మీనా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చదవండి..

 

‘క్రాక్‌’ రీమేక్‌ చేస్తా: గోపీచంద్‌ మలినేని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని