Sardar: ‘సర్దార్‌’ కబురు

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌’. రాశిఖన్నా కథానాయిక. రజీషా విజయన్‌, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాత. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని

Updated : 28 Jun 2022 13:55 IST

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌’. రాశిఖన్నా కథానాయిక. రజీషా విజయన్‌, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాత. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘టైక్నో-థ్రిల్లర్స్‌ని రూపొందించడంలో మంచి పేరున్న మిత్రన్‌ మరో ఆసక్తికరమైన కథతో తీస్తున్న చిత్రమిది. ‘అభిమన్యుడు’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఈసారి కార్తితో దీన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి విడుదలవుతుండటం ఆనందంగా ఉంద’’ని సినీవర్గాలు తెలిపాయి. లైలా, మునిస్కాంత్‌, అశ్విన్‌, యోగ్‌జాపి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని