Anni manchi sakunamule review: రివ్యూ: అన్నీ మంచి శకునములే
Anni manchi sakunamule review: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ ఎలా ఉందంటే?
Anni manchi sakunamule review; చిత్రం: అన్నీ మంచి శకునములే; నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్ తదితరులు; సంగీతం: మిక్కీ జే మేయర్; సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ; నిర్మాత: ప్రియాంక దత్; సంభాషణలు: లక్ష్మీ భూపాల; స్క్రీన్‌ప్లే: షేక్ దావూద్ జి; దర్శకత్వం: బి.వి. నందినిరెడ్డి; విడుదల: 18-05-2023
వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను పలకరిస్తున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందినిరెడ్డి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈరోజు విడుదలైన చిత్రమే ‘అన్నీ మంచి శకునములే’. మాళవిక నాయర్ కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది?(Anni manchi sakunamule review) కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏమున్నాయి?
కథేంటంటే: విక్టోరియాపురం అనే ఊరిలో జరిగే కథ ఇది. అందులో ఉన్న కె.జి.కాఫీ ఎస్టేట్‌కు.. అక్కడ తయారయ్యే కాఫీ పొడికి ఓ ప్రత్యేకమైన ఖ్యాతి ఉంది. అయితే ఆ కాఫీ ఎస్టేట్ విషయమై ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్) కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఓ కోర్టు కేసు నడుస్తుంటుంది. ఆ కేసు విషయంలో రాజీ పడమని న్యాయమూర్తులు వాళ్లిద్దరికీ నచ్చ చెప్పినా ఎవరూ వెనక్కి తగ్గరు. దాంతో ఆ కేసు డైలీ సీరియల్‌లా అలా కొనసాగుతూనే ఉంటుంది. దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేష్) కొడుకు రిషి (సంతోష్ శోభన్).. ప్రసాద్ కూతురు ఆర్య (మాళవిక నాయర్) ఒకేరోజు ఒకే ఆస్పత్రిలో జన్మిస్తారు. కానీ, ఆస్పత్రి సిబ్బంది చేసిన ఓ పొరపాటు వల్ల పిల్లలు తారుమారవుతారు. దాంతో ప్రసాద్ కొడుకుగా రిషి.. సుధాకర్ కూతురిగా ఆర్య పెరిగి పెద్ద వారవుతారు. చదువుకునే రోజుల్లోనే ఆర్యపై రిషి మనసు పారేసుకుంటాడు. (Anni manchi sakunamule review) తన మనసులో మాట ఆమెకు చెప్పాలనుకున్న ప్రతిసారీ ఏదోక అవాంతరం ఎదురవుతూనే ఉంటుంది. దాంతో తన ప్రేమను మనసులోనే దాచేసుకుంటాడు రిషి. ఈ ఇద్దరూ పెరిగి పెద్దయ్యాక కాఫీ బిజినెస్ పని మీద యూరప్ వెళ్తారు. అక్కడ అనుకోకుండా రిషి - ఆర్యల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. దాంతో ఇద్దరూ విడిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ఇద్దరి ప్రేమ కథ పెళ్లి పీటలు ఎలా ఎక్కింది? వాళ్ల పుట్టుకకు సంబంధించిన రహస్యం ప్రసాద్, దివాకర్ కుటుంబాలకు ఎలా తెలిసింది? ఈ ఇరు కుటుంబాల మధ్య నలుగుతున్న కాఫీ ఎస్టేట్‌కు సంబంధించిన కేసు ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. 1920ల నాటి కె.జి.కాఫీ ఎస్టేట్‌కు సంబంధించిన కథను.. అక్కడి కాఫీ పొడికి ఉన్న ప్రత్యేకతను పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్స్‌తోనే సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించారు దర్శకురాలు నందినిరెడ్డి. ఇక ఆ తర్వాత ఆ కాఫీ ఎస్టేట్‌కు సంబంధించి దివాకర్, ప్రసాద్ కుటుంబాల మధ్య సాగుతున్న కోర్టు కేసును ఫన్నీగా పరిచయం చేస్తూ కథకు కీలకమైన మరో మలుపును చూపించారు. రిషి- ఆర్య ఒకేసారి జన్మించడం.. ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వాళ్లిద్దరూ తారుమారయ్యి ఒకరింట మరొకరు పెరగడం అలా కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. (Anni manchi sakunamule review) నిజానికి ఈ పాయింట్ చూసినప్పుడే ఇరు కుటుంబాల మధ్య నలుగుతున్న కోర్టు కేసు ఎలా ముగుస్తుంది? పతాక సన్నివేశాలు ఎలా ఉండనున్నాయి? అన్నది ప్రేక్షకులు ఓ ఊహకు వచ్చేస్తారు. అయితే ఈ కేసు విషయమై ఇరు కుటుంబాల మధ్య సాగే సంఘర్షణను కాస్త బలంగా తీర్చిదిద్దుకొని ఉంటే సినిమాలో మరింత డ్రామా పండించడానికి అవకాశముండేది. కానీ, దర్శకురాలు ఆ కోర్టు కేసులు, గొడవల్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు.
రిషి - ఆర్యల ప్రేమకథను ఆరంభంలో దశల వారీగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు నందిని. అందులో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా.. మరికొన్ని సాగతీత వ్యవహారంగా అనిపిస్తాయి. రిషి-ఆర్యల మధ్య వచ్చే ఓ చిన్న ఇగో క్లాష్‌తో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిజానికి ఈ ప్రేమకథలో వచ్చే ఈ ఇగో క్లాష్‌నైనా కాస్త సంఘర్షణాత్మకంగా తీర్చిదిద్దుకొని ఉంటే ద్వితీయార్ధం మరింత రసవత్తరంగా సాగి ఉండేది. కానీ, నందిని ఆ అవకాశాన్నీ వినియోగించుకోలేదు. (Anni manchi sakunamule review) దీంతో అసలీ కథలో బలమైన కాన్‌ఫ్లిక్ట్ ఏంటన్నది ప్రేక్షకులకు అర్థం కాదు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ విషయానికొస్తే.. తెరపై బోలెడంత తారాగణమున్నా, ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా.. అది మరీ టీవీ సీరియల్‌లాగే అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు చాలా భావోద్వేగభరితంగా సాగుతాయి. ముఖ్యంగా తమ పిల్లల పుట్టుక వెనకున్న రహస్యం తెలిశాక ఆ తల్లిదండ్రులు పడే వేదనను మనసులకు హత్తుకునేలా చూపించారు నందిని రెడ్డి.
ఎవరెలా చేశారంటే: నటుడిగా సంతోష్ శోభన్‌ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. రిషి పాత్రను మంచి ఈజ్‌తో చాలా అవలీలగా చేసేశాడు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగభరితమైన నటనతో మనసుల్ని బరువెక్కిస్తాడు. మాళవికకు ఇది అలవాటైన పాత్రే. తెరపై అందంగా కనిపిస్తూనే.. నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, షావుకారు జానకీ.. ఇలా తెరపై బోలెడంత మంది తారలున్నా ఎవరికీ బలమైన పాత్ర పడినట్లు అనిపించదు. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, మహేష్ తదితరులు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. (Anni manchi sakunamule review) నందిని రెడ్డి ఎంచుకున్న కథలోనూ.. దాన్ని తెరకెక్కించిన తీరులోనూ ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఏమాత్రం హింస, అసభ్యత కనిపించకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు. మిక్కీ జె.మేయర్ సంగీతం ఆహ్లాదకరంగా అనిపించింది. టైటిల్ పాటతో పాటు మరో రెండు గీతాలు వినసొంపుగా అనిపించాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్‌ల ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- బలాలు
- + సంతోష్, మాళవిక నటన
- + పాటలు
- + పతాక సన్నివేశాలు
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథ
- - నెమ్మదిగా సాగే కథనం
- చివరిగా: ఎమోషన్స్ కనెక్ట్ అయితే ‘అన్నీ మంచి శకునములే’ (Anni manchi sakunamule review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం