Anni Manchi Sakunamule: ‘అన్నీ మంచి శకునములే’తో ఆ నమ్మకం మళ్లీ నిజమైంది
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించింది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించింది. రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చూసిన వారంతా ‘ఇది మన సినిమా’ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం చేశాక మా అమ్మ ముఖంలో ఆనందం చూశాను. 20ఏళ్ల క్రితం నాన్న తీసిన ‘వర్షం’ చూశాక అమ్మలో సంతోషం చూశాను. మళ్లీ ఇన్నేళ్లకు అంత సంతోషాన్ని ఈ చిత్రం తిరిగి తీసుకొచ్చింది. స్వప్న, ప్రియాంక, నందిని రెడ్డినే దీనికి కారణం. నిజాయితీగా ఈ సినిమా తీశాం. దీని గురించి ప్రేక్షకులే నిజాయితీగా మాట్లాడతారు’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో నా ఆర్య పాత్ర చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దానికి నేను న్యాయం చేశాను’’ అంది నాయిక మాళవిక. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్ ఉంటే ఫ్యామిలీస్ తప్పకుండా థియేటర్లకు వస్తాయి. అదే నమ్మకాన్ని ఈ చిత్రంతో ఈరోజున చూపిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు క్లైమాక్స్ గురించి నేనేదైతే చెప్పానో.. దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే మాళవిక పాత్రకు చాలా కుటుంబాలు కనెక్ట్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని కాసేపు పక్కన పెడితే ఇదొక అందమైన భావోద్వేగభరితమైన సినిమా. నా అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. సినిమా అంటే మాస్ మాత్రమే కాదు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. దీన్ని మేము ప్రేమతో చేశాం. చుట్టేయలేదు. దీనికి మిశ్రమ స్పందన వచ్చినా.. కుటుంబం అంతా కూర్చొని చూసే సినిమా ఇదనిపించింది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు