జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘జెర్సీ’

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీటిని

Updated : 22 Mar 2021 18:57 IST

దిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరిల్లో ‘మహర్షి’కి అవార్డులు దక్కాయి.


 

మిగిలిన అవార్డులు ఇవే...

* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

* ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

* ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

* ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

* ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

* ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

* ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి-తేరీ మిట్టీ...)

* ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని