సోషల్‌ మీడియాలో బన్నీ హవా!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికి తెలిసిందే! ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అమితంగా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ ఫాలోవర్స్‌ సంఖ్య 10మిలియన్లకు చేరింది.

Published : 08 Jan 2021 01:21 IST

ఇన్‌స్టాలో 10 మిలియన్లు దాటిన ఫాలోవర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆయన ఖాతాలను అనుసరించే  వారి సంఖ్య భారీగా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ ఫాలోవర్స్‌ సంఖ్య 10మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో ఆయనకు అభినందనలు చెబుతున్నారు. 

అలాగే బన్నీకి ట్విటర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఫాలోవర్స్‌ సంఖ్య మిలియన్లలోనే ఉంది. ట్విటర్‌లో ప్రస్తుతం 5.5 మిలియన్ల మంది నెటిజన్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు పైమాటే. అల్లుఅర్జున్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన బన్నీ, ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో బన్నీ లారీ డ్రైవర్‌గా మంచి మాస్‌ లుక్‌లో కనిపించారు.

ఇవీ చదవండి!

సోనూసూద్‌పై కేసు నమోదు చేయండి: బీఎంసీ

భారత బౌలర్లు శభాష్‌: మెక్‌గ్రాత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని