Ante Sundaraniki: నాని- నజ్రియా ఫన్నీ చిట్‌చాట్‌.. వీరి ఇష్టాలేంటో మీకు తెలుసా?

తమ అభిమాన నటుల వ్యక్తిగత వివరాలపై చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. వారు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? ఏ ప్రదేశాలను ఇష్టపడతారు? అనే వాటికి సమాధానాలను వెతుకుతూ ఉంటారు.

Published : 26 May 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ అభిమాన నటుల వ్యక్తిగత వివరాలపై చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఖాళీ సమయంలో ఏం చేస్తారు? ఏ ప్రదేశాలను ఇష్టపడతారు? అనే వాటికి సమాధానాలను వెతుకుతూ ఉంటారు. సోషల్‌ మీడియా చిట్‌చాట్‌ ద్వారా, ఏదైనా సినిమా ప్రచారంలో భాగంగా నటులు అప్పుడప్పుడు ఆ విశేషాలు పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే నాని (Nani), నజ్రియా (Nazriya Fahadh) తమ ఫ్యాన్స్‌ సందేహాలు తీర్చారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaniki) చిత్రం జూన్‌ 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. ఇందులో నాని- నజ్రియా.. ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో పరీక్ష పెట్టుకున్నారు. తాము ఎక్కువగా వినియోగించే యాప్‌, ఇష్టమైన సినిమాలు, నచ్చే ప్రదేశాలు తదితర వాటిపై ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ప్రమోషనల్‌ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో సుందర్‌ పాత్రలో నాని, లీల పాత్రలో నజ్రియా కనిపించనున్నారు. మరి ఈ సుందర్‌, లీల ప్రశ్నాజవాబులను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని