Ante Sundaraniki: ఓటీటీలో ‘అంటే.. సుందరానికీ!’.. ఎప్పుడు?ఎక్కడంటే..!

మతాంతర వివాహం అనే సీరియస్‌ టాపిక్‌ని ఫన్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya).

Updated : 22 Jun 2022 21:03 IST

హైదరాబాద్‌: మతాంతర వివాహం అనే సీరియస్‌ టాపిక్‌ని ఫన్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya). ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ, ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘అంటే... సుందరానికీ!’ (Ante Sundaraniki). నాని(Nani), నజ్రియా (Nazriya) మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్స్‌ విషయంలో కాస్త నిరాశపరిచిందని సినీ విశ్లేషకుల అంచనా. ఇప్పటివరకూ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం మరికొన్నిరోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. ‘అంటే... సుందరానికీ!’ ఓటీటీ రిలీజ్‌పై బుధవారం అప్‌డేట్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో జులై 8నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.

ఇంతకీ కథంటంటే..!

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) అనే యువకుడు కుటుంబ ఆచారాలతో విసిగిపోతుంటాడు. అతనికి చిన్నతనం నుంచి లీల (నజ్రియా) అంటే ఇష్టం. ఇద్దరూ కలిసే చదువుకుంటారు. కెరీర్‌లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. కానీ సుందర్ తండ్రి శాస్త్రి (నరేష్), లీల తండ్రి థామస్ (అజఘం పెరుమాల్)కు మరో మతం అంటే అస్సలు గిట్టదు. భిన్న కుటుంబ నేపథ్యాలు, మతాచారాలు మధ్య ప్రేమికులుగా సుందర్, లీలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాళ్ల ప్రేమను దక్కించుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని