Nani: ‘అంటే సుందరానికీ!’ చక్కిలిగింతల స్పెషల్‌ వీడియో చూశారా..!

‘స్వాగతం అందమైన ప్రపంచానికి..’ అంటూ నాని ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుట్టిస్తున్నాడు. ఆయన హీరోగా వివేక్‌ ఆత్రేయ

Published : 26 May 2022 18:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘స్వాగతం అందమైన ప్రపంచానికి..’ అంటూ నాని ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుట్టిస్తున్నాడు. ఆయన హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అంటే.. సుందరానికీ!’. ఈ సుందరం సరసన నజ్రియా ఫహద్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. హాస్య ప్రధానంగా సాగే కథతో రూపొందిన ఈ చిత్రం జూన్‌10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. షూటింగ్‌ సమయంలోని బ్లాపర్స్ చూసేవాళ్లకు సైతం నవ్వుతెప్పిస్తున్నాయి. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను మీరు చూసేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని