Anu Emmanuel: శిరీష్‌తో డేటింగ్‌ వార్తలు.. అమ్మ బాధపడింది: అను ఇమ్మాన్యుయేల్‌

‘ఊర్వశివో రాక్షసివో’ కోసం మొదటిసారి శిరీష్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు నటి అను ఇమ్మాన్యుయేల్‌. నేటి తరం యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Updated : 07 Dec 2022 19:15 IST

హైదరాబాద్‌: అల్లు శిరీష్‌ (Allu Sirish)తో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై నటి అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమని, అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనని అన్నారు. అయితే, ఈ వార్తలు చదివి తన తల్లి బాధపడిందని చెప్పారు.

వీరిద్దరూ జంటగా నటించిన రీసెంట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ, డేటింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అను-శిరీష్‌పై ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని