Butterfly: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అనుపమ ‘బటర్‌ఫ్లై’

అనుపమ పరమేశ్వరన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘బటర్‌ఫ్లై’ విడుదలకు సిద్ధమైంది.

Published : 12 Dec 2022 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ప్రధాన పాత్ర పోషించిన ‘బటర్‌ఫ్లై’ (Butterfly) విడుదలకు రంగం సిద్ధమైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 29 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఓ వీడియో షేర్‌ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. గంటా సతీశ్‌ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి దీన్ని నిర్మించారు. మరోవైపు అనుపమ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘18 పేజీస్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని