Butterfly: ఆసక్తిగా అనుపమ పరమేశ్వరన్ ‘బటర్‌ఫ్లై’ ట్రైలర్..
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన ‘బటర్‌ఫ్లై’ (Butterfly) సినిమా ట్రైలర్ విడుదలైంది. సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్: అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బటర్‌ఫ్లై’ (Butterfly). ఈ చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీలోకి విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో(Disney Plus Hotstar) డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న ఈ సినిమా ట్రైలర్(Butterfly Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే పిల్లల కిడ్నాప్ చూట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. కిడ్నాప్ అయిన పిల్లలను అనుపమ కాపాడుకుంటుందా.. కిడ్నాపర్ పిల్లలను చంపేశాడా.. ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించగా రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. మరోవైపు అనుపమ తన తదుపరి చిత్రం ‘18 పేజీస్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా