Anupama: చిన్న ప్రయత్నాలు... పెద్ద ఆనందాలు

‘‘ఒక్కోసారి చిన్న ప్రయత్నాలైనా... పెద్ద ఆనందాలను ఇస్తాయి. గొప్ప అనుభూతులను తెస్తాయి’’ అంటోంది కేరళ కుట్టి... అనుపమ పరమేశ్వరన్‌. ఇటీవల ఈమె ‘ఫ్రీడమ్‌జీమిడ్‌నైట్‌’ అనే 29 నిమిషాల

Updated : 16 Apr 2022 08:46 IST

‘‘ఒక్కోసారి చిన్న ప్రయత్నాలైనా... పెద్ద ఆనందాలను ఇస్తాయి. గొప్ప అనుభూతులను తెస్తాయి’’ అంటోంది కేరళ కుట్టి... అనుపమ పరమేశ్వరన్‌. ఇటీవల ఈమె ‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ అనే 29 నిమిషాల నిడివున్న షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది. 6వ ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇందులో నటనకు గాను అనుపమకు ఉత్తమ నటిగా బహుమతి అందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘భర్త చేస్తున్న మోసాన్ని  తెలుసుకున్న ఓ మధ్యతరగతి ఇల్లాలు పాత్ర అది. చాలా మంది గృహిణిల మనసును ఆవిష్కరించిన చిత్రమిది. మా చిన్న ప్రయత్నానికి పెద్ద బహుమతి దక్కింది’’ అని పేర్కొంది. దీనికి ఆర్‌.జె.షాన్‌ దర్శకత్వం వహించారు. యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. కోటికిపైగా వీక్షణలతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం అనుపమ ‘18పేజెస్‌’, ‘కార్తికేయ-2’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని