Bollywood: ‘‘ది బ్లాక్‌ టైగర్‌’’ పేరుతో మరో రియల్‌ హీరో బయోపిక్‌

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ బసు (Anurag Basu) ఇండియన్‌ ఏజంట్‌ రవీంద్ర కౌశిక్‌ (Ravindra Kaushik) జీవిత చరిత్రను సినిమాగా రూపొందించనున్నారు. ‘‘ది బ్లాక్‌ టైగర్‌’’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది.

Published : 09 Feb 2023 14:43 IST

ముంబయి: ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ ‌(biopic)లు విడుదలై సూపర్‌ హిట్‌ అందుకున్నాయి. తాజాగా మరో రియల్ హీరో జీవితచరిత్ర సినిమాగా రానుంది. భారత్‌కు గూఢచారిగా పనిచేసిన రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) జీవితంలో జరిగిన సంఘటనలను ‘‘ది బ్లాక్‌ టైగర్‌’’(The Black Tiger) పేరుతో తెరపై చూపించడానికి బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధమయ్యారు.

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ బసు (Anurag Basu) పాకిస్థాన్‌లో ఇండియన్‌ ఏజంట్‌గా పనిచేసిన రవీంద్ర కౌశిక్‌ బయోపిక్‌ రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘రవీంద్ర కౌశిక్‌ ధైర్యానికి పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనం. 20 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఎన్నో సాహసాలు చేశాడు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా విషయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇలాంటి వాళ్లు మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’’ అని అన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. 1952 ఏప్రిల్‌11న హరియాణాలో పుట్టిన రవీంద్ర కౌశిక్‌ ఇండియన్‌ ఏజంట్‌గా పనిచేశారు. అతడిని బ్లాక్‌ టైగర్‌ అని పిలుస్తారు. విధి నిర్వహణలో పాకిస్థాన్‌కు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తూ వీరమరణం చెందాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని