ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన అనురాగ్‌ కుమార్తె.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ (Anurag Kashyap) కుమార్తె నిశ్చితార్థం వేడుకగా జరిగింది.

Published : 22 May 2023 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కుమార్తె ఆలియా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితుడు షేన్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం శనివారం జరిగింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.  ఇన్‌స్టా వేదికగా ఆలియా ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘ఇక, ఇది జరిగింది!! నా బెస్ట్‌ ఫ్రెండ్‌, పార్ట్‌నర్‌,  సోల్‌మేట్‌. ఇప్పుడు అతడు నాకు కాబోయే భర్త అయ్యాడు. షేన్‌.. నిజం, అపరిమితమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నీకు ఎస్‌ చెప్పడమే.. నేను చేసిన అత్యంత సులభమైన పని. మిగిలిన నా జీవితాన్ని నీతో కలిసి గడిపేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని ఆమె రాసుకొచ్చారు. ఇక, ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ తారలు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. అనన్యా పాండే, సన్నీలియోనీ, జాన్వీకపూర్‌, శోభితా ధూళిపాళ్ల  తదితరులు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స్‌ చేశారు.

ఆలియా - షేన్‌ ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యుల అంగీకారంతో తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, అనురాగ్‌ కశ్యప్‌ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలకు ఆయన దర్శకుడిగానే కాకుండా నిర్మాత, స్క్రీన్‌ రైటర్‌గా వ్యవహరించారు. ‘బాంబే టాకీస్‌’, ‘బాంబే వెల్వెట్‌’, ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘దోబారా’ వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘కెన్నెడీ’ కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు