Anurag Kashyap: సుశాంత్ చనిపోవడానికి ముందు మెసేజ్ వచ్చింది: అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ (Sushant Singh Rajput) విషయంలో తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తెలిపారు.
ముంబయి: సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ (Sushant Singh Rajput) చనిపోవడానికి మూడు వారాల ముందు అతని టీమ్ నుంచి తనకు సందేశం వచ్చిందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తెలిపారు. సుశాంత్‌ని తాను కలవలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘‘సుశాంత్ సింగ్ మృతి నిజంగా దురదృష్టకరం. నేను ఎంతో బాధపడ్డా. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా మూడు వారాల ముందు అతడి టీమ్ నుంచి ఓ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. సుశాంత్ నన్ను కలవాలనుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. ‘అతడితో నేను మాట్లాడాలనుకోవడం లేదు’ అని బదులిచ్చాను. ఆ తర్వాత నేను ఎంతో బాధపడ్డా. ఇలా ఎప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇటీవల అభయ్ డియోల్‌తో గొడవలు వచ్చినప్పుడు కూడా.. నా మాటల వల్ల ఆయన బాధపడుతున్నాడని తెలిసి వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాను’’ అని అనురాగ్ కశ్యప్ తెలిపారు.
సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఎం.ఎస్.ధోనీ’ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనుకోని కారణాల వల్ల 2020లో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణం తర్వాత అనురాగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. సుశాంత్‌తో తాను ఓ సినిమా చేయాలనుకున్నానని, కాకపోతే అతడి ప్రవర్తన నచ్చక ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశానని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: వికెట్ల మధ్య ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు..? వరస్ట్ రన్నర్ ఎవరు..? కోహ్లీ సమాధానాలివే..
-
Crime News
Sangareddy: భార్యాభర్తల గొడవ.. ఏడాదిన్నర చిన్నారి అనుమానాస్పద మృతి
-
India News
Tit for Tat: దిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ బయట బారికేడ్లు తొలగింపు..!
-
India News
PM Modi: మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష
-
General News
Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన
-
Movies News
Das Ka Dhamki Review: రివ్యూ: దాస్ కా ధమ్కీ