OTT: నా స్వార్థం కోసం సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయలేను: ప్రముఖ దర్శకుడు

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) మరోసారి ఓటీటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లాభం కోసం సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు విక్రయించనని అన్నారు.

Published : 31 Jan 2023 01:17 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌(Bollywood) దర్శకుల్లో అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) ఒకరు. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు ఈ డైరెక్టర్‌. తాజాగా ఓటీటీ(OTT)లపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనురాగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదల చేస్తే లాభం వస్తుందని.. కానీ, తను అలా చెయ్యనని అన్నారు. దానికి గల కారణాన్ని తెలిపారు.

‘‘సులభంగా లాభం పొందాలంటే సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు విక్రయిస్తే సరిపోతుంది. కానీ నా సినిమాలో నటీనటులు ఇద్దరూ కొత్తవాళ్లు. వాళ్లు ఈ సినిమా కోసం వాళ్ల 5 సంవత్సరాల జీవితాన్ని నాకు కేటాయించారు. అందుకే నా స్వార్థం కోసం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చెయ్యలేను. నా లాభం కోసం వారిద్దరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను’’ అని అన్నారు. ఇక షారుఖ్‌(Shah Rukh Khan) నటించిన ‘పఠాన్‌’(Pathan) గురించి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంపై వివాదాలు సృష్టించే వారిని అలానే చెయ్యనివ్వండి. దాని వల్ల ఏమీ కాదు’’ అన్నారు.

ఇక ఇటీవల ఈ స్టార్‌ డైరెక్టర్‌ బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ఫుత్‌ (Sushant Singh Rajput) విషయంలో మరోసారి బాధపడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ చనిపోవడానికి మూడు వారాల ముందు అతని టీమ్‌ నుంచి తనకు సందేశం వచ్చిందని అన్నారు. సుశాంత్‌ని కలవలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని