Anushka: చిత్రీకరణకు రెడీ

అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెర కెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 02 Apr 2022 13:48 IST

నుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెర కెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈనెల 4నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఓ కొత్తతరం కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో అనుష్క సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. దీన్ని తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించనున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు