Updated : 05 Aug 2022 14:54 IST

Anushka Sharma: లీడ్స్‌లో అనుష్క క్రికెట్‌ శిక్షణ

భారత మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో వెండి తెరపైకి రానుంది. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ప్రోసిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఆగస్టు నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా సినిమాలోని కీలకమైన క్రికెట్‌ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించనున్నారు. ఇప్పుడీ సీక్వెన్స్‌ కోసం తనని తాను సిద్ధం చేసుకుంటోంది అనుష్క. ఇందుకోసం ఆమె ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో తన క్రికెట్‌ నైపుణ్యాలకు   మెరుగులు దిద్దుకుంటోంది. ‘‘తెరపై జులన్‌గా మారడానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని అనుష్క వదిలిపెట్టడం లేదు. తన చేతిలో ఉన్న పాత్రకు న్యాయం చేయాలని తపన పడుతోంది. ఈ క్రమంలోనే తన క్రికెట్‌ నైపుణ్యాలకు లీడ్స్‌లో మెరుగులు దిద్దుకుంటోంది. అలాగే జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తోంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts