విరాట్‌ను అమాంతం పైకెత్తిన అనుష్క 

క్రికెట్, సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. వారిద్దరి మధ్య జరిగే సరదా సన్నివేశాలను తరచూ అభిమానులతో పంచుకొని అలరిస్తుంటారు.

Published : 07 Apr 2021 23:30 IST

సరదా వీడియోను షేర్ చేసిన నటి

ముంబయి: క్రికెట్, సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తమ మధ్య జరిగే సరదా సన్నివేశాలను తరచూ అభిమానులతో పంచుకొని అలరిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకదాన్ని అనుష్క ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున.. పరోక్షంగా ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యాన్ని వెల్లడించింది. అందులో ఆమె చేసిన ఫీట్ అందరి చేత వావ్ అనిపిస్తోంది. 

గతంలో జరిగిన ఓ షూటింగ్‌ సెట్‌లో తీసిన వీడియోలో విరుష్క జంట సరదాగా మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఆ సమయంలో అనుష్క విరాట్‌ను వెనకనుంచి పట్టుకొని ఉన్నట్టుండి అమాంతం పైకి లేపింది. అనుష్క పనికి ఒక్కసారిగా షాక్‌ అయిన విరాట్.. మరోసారి ట్రై చేయమని అడుగుతాడు. ‘నువ్వు నాకేం సాయం చేయొద్దు’ అంటూ విరాట్‌ని ఒప్పించి.. మరోసారి పైకెత్తేస్తుంది. తర్వాత అక్కడున్నవారికి తన కండలు చూపిస్తూ.. మురిసిపోయింది. ఇప్పుడు ఆ వీడియోను పోస్టు చేస్తూ.. నేను చేశానా? అంటూ వ్యాఖ్యను జోడించింది. ఈ టీమిండియా కెప్టెన్ దానికి స్పందిస్తూ కామెంట్‌ సెక్షన్‌లో పగలబడి నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు. 

జనవరిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు వామిక అని పేరుపెట్టారు. కొంతకాలం పాపకు పూర్తి సమయం కేటాయించిన వారు.. ఇప్పుడు తమ వర్క్‌తో బిజీ అవుతున్నారు. ఇటీవల అనుష్క ముంబయిలో యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని