Anushka Sharma: విరాట్‌లో ఆ కోణం నాకు మాత్రమే తెలుసు.. అదేంటంటే..

సినీ పరిశ్రమలోనే కాదు.. క్రికెట్‌ ప్రపంచంలోనూ ఆ జంటకుండే క్రేజ్‌ వేరు. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరైనా..

Updated : 07 Oct 2021 07:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమలోనే కాదు.. క్రికెట్‌ ప్రపంచంలోనూ ఆ జంటకుండే క్రేజ్‌ వేరు. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరైనా...వాళ్ల వ్యక్తిగత ఫొటోలు పెడితే చాలు అది నెట్టింట వైరల్‌ కావాల్సిందే. వారే ‘విరుష్క’ జంట. భారత క్రికెట్‌ టీమ్‌, ఐపీఎల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ సారథి  విరాట్‌కోహ్లీ-  బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ. బుధవారం తన భర్త విరాట్ కోహ్లీ గురించి తెలియని విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో అనుష్క వెల్లడించింది. వివిధ మూడ్స్‌, అవతారాల్లో విరాట్‌ను కెమెరాలో బంధిస్తూ ఇలా వివరించింది. ‘‘ మీరంతా క్రికెట్‌ గ్రౌండ్‌లో చూసే విరాట్‌ వేరు.. ప్రతీరోజు నేను చూసే విరాట్‌ వేరు. రియల్‌గా తనెలా ఉంటాడో నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే.. నాకు మాత్రమే ఆ కోణం తెలుసు. ప్రతీ రోజూ తనదగ్గరో కథ ఉంటుంది.  తన అభిరుచిని, ప్రశాంతతను  బ్యాలెన్స్‌ చేస్తాడు.  తనకు నచ్చిన వాటికోసం చాలా ఎక్కువగా కష్టపడతాడు. ప్రతీరోజూ తనని తాను మెరుగుపరుచుకునేందుకు శ్రమిస్తాడు. ఫీల్డ్‌లోకానీ, బయటకానీ బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదే ‘విరాట్‌ కథ’ ’’ అని అనుష్క వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ చెప్పింది. వీరి కుమార్తె ‘వామిక’ విశేషాలను ఈ జంట ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘‘ వామిక మా జీవితాల్లోకి అడుగుపెట్టాక చుట్టూ ఎన్నో మార్పులు చూశాం. ఇన్నేళ్లు ఓ హీరోయిన్‌గా, క్రీడాకారుడిగా రాణించినప్పటికీ.. ఓ తల్లిగా, తండ్రిగా కుమార్తెకు పంచే అనుభూతి వేరే ఉంటుంది’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని