పోలవరంలో హీరోయిన్‌ అనుష్క

అగ్ర కథానాయిక అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు....

Published : 10 Dec 2020 01:18 IST

ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

ఏలూరు: అగ్ర కథానాయిక అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పంచాయతీ పరిధిలోని గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సన్నిహితులతో కలిసి పడవలో గోదావరి నది దాటిన ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతితో కలిసి స్వీటీ కనిపించారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఉన్నప్పటికీ ఎటువంటి ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనుష్క సింప్లిసిటీకి మరోసారి అభిమానులు ఫిదా అయ్యారు. అనుష్క తన స్వస్థలం మంగళూరు నుంచి పురుషోత్తపట్నం వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లారట. అనుష్కకు దైవభక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే.

గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డి’లో మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా కనిపించిన అనుష్క ఆపై ‘నిశ్శబ్దం’లో నటించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. అనుష్క దివ్యాంగురాలిగా నటించిన ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. దీని తర్వాత ఆమె తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.

ఇవీ చదవండి..
‘సర్కారువారి పాట’లో అనుష్క.. నిజమెంత?
ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని