Anushka: భూతకోల ప్రదర్శనను తిలకించిన అనుష్క.. వీడియో వైరల్‌

అగ్ర కథానాయిక అనుష్క తాజాగా మంగళూరులో నిర్వహించిన కర్ణాటక సంప్రదాయ ప్రదర్శన ‘భూతకోల’ను వీక్షించారు.

Published : 23 Dec 2022 01:42 IST

మంగళూరు: చాలా రోజుల తర్వాత అగ్ర కథానాయిక అనుష్క వార్తల్లోకి వచ్చారు. గత కొంతకాలంగా ఎక్కడ చూసినా కాంతార ప్రభావమే కనిపించిన సంగతి తెలిసిందే. ‘వరాహరూపం’ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ క్రమంలో అగ్ర కథానాయిక అనుష్క భూతకోల ప్రదర్శన వీక్షించారు. మంగళూరులో నిర్వహించిన భూతకోలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. భూతకోల ప్రదర్శనను ఆమె వీడియో తీస్తూ కనిపించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క సినిమాలు తగ్గించేశారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్‌ దర్శకుడు. ఇందులో అనుష్క షెఫ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా గురించి కూడా పెద్దగా అప్‌డేట్‌లు లేవు. ఈ క్రమంలో ఇటీవల అనుష్క పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం పంచుకుంది. గత కొన్ని రోజులుగా వెండితెరపై అనుష్కను చూద్దామనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. వచ్చే ఏడాది అయినా అనుష్క సినిమా వస్తుందని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు