Anushka: అనుష్క లుక్‌పై అవాక్కవుతున్న అభిమానులు.. సినిమా కోసమేనా అలా?
ప్రముఖ నటి అనుష్క కుటుంబంతో కలిసి ఇటీవల ఓ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోల్లో అనుష్కను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బొద్దుగా ఉండే నటులు నాజూగ్గా తయారైనా.. స్లిమ్‌గా ఉండే వారు కాస్త లావుగా కనిపించినా సినీ అభిమానులకు ఆశ్చర్యమే! ప్రముఖ నటి అనుష్క (Anushka Shetty) శెట్టి విషయంలో కొందరు ప్రస్తుతం అదే ఫీలవుతున్నారు. ఏమైందంటే.. మహా శివరాత్రిని పురస్కరించుకుని అనుష్క కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఓ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను ఎవరో నెట్టింట షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. వాటిల్లో అనుష్క లావుగా ఉన్నారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదేంటి మేడమ్ ఇలా అయిపోయారు?’, ‘మిమ్మల్ని మరిన్ని చిత్రాల్లో చూడాలనుకుంటున్నాం. దయచేసి బరువు తగ్గండి’ అంటూ ఫ్యాన్స్ ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘అనుష్క ఎప్పటిలానే అందంగా ఉన్నారు’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
నవీన్ పొలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో దర్శకుడు పి. మహేశ్‌బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఖరారుకాని ఆ సినిమాలో అనుష్క రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారని, అందులోని ఓ క్యారెక్టర్ కోసమే బరువు పెరుగుతున్నారని తెలుస్తోంది. గతంలో ‘సైజ్ జీరో’లోని పాత్ర డిమాండ్ మేరకు అనుష్క అధికంగా బరువు పెరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.