Andhra News: ‘ఆచార్య’ టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదల కానుంది.

Updated : 26 Apr 2022 11:30 IST

అమరావతి: ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. పదిరోజుల పాటు రూ.50 పెంచుకునేందుకు అంగీకరించింది. సినిమా నిర్మాణ బడ్జెట్‌ రూ.100కోట్లు దాటిన నేపథ్యంలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే ఐదో షో విషయంలో మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రాధేశ్యామ్‌ చిత్రాలకు కూడా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది.

మరోవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ‘ఆచార్య’ ఐదో షోతో పాటు టికెట్‌ ధరల పెంపునకు అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్తా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్‌ అథారిటీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐదో ఆటతోపాటు టికెట్‌ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు