RRR: ‘మగధీర’ చూసినప్పుడే రాజమౌళి గురించి అర్థమైంది..: ఏఆర్‌ రెహమాన్‌

జక్కన గురించి ఆస్కార్‌ విజేత ఎ.ఆర్‌. రెహమాన్‌(AR Rahman) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 19 Oct 2022 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దాని హవా కొనసాగిస్తూనే ఉంది. అంత గొప్పగా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి(Rajamouli). ఇటీవలే చిత్రబృందం ఈ సినిమాను ఆస్కార్‌ బరిలో నిలిపిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం ఆస్కార్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆశ పడుతున్నారు. ఇక తాజాగా జక్కన గురించి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచేవిధంగా ఉంటాయి’’ అని అన్నారు.

ఇక పాన్‌ ఇండియా సినిమాల గురించి మాట్లాడిన ఈ సంగీత దిగ్గజం ‘‘రోజా, బొంబాయి, దిల్‌ సే.. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలే ’’ అని చెప్పారు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌ గురించి మాట్లాడారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించిందని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని