Tokyo Olympics: ‘హిందూస్థానీ వే’ అలా రూపొందింది

మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ వేదికపై భారతదేశ జెండా ఎగురవేసేందుకు మన క్రీడాకారులు సిద్ధమయ్యారు. కాగా.. ఒలింపిక్స్‌లో పాల్గొనే..

Updated : 18 Jul 2021 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ వేదికపై భారతదేశ జెండా ఎగురవేసేందుకు మన క్రీడాకారులు సిద్ధమయ్యారు. కాగా.. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, రచయిత్రి, గాయని అనన్య బిర్లా ‘హిందూస్థానీ వే’ పేరుతో ఒక పాట రూపొందించారు. ఆ పాటను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారిద్దరూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో మన దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్న క్రీడాకారులకు రెహమాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు.. చాలా మంది క్రీడాకారులు ఉన్నా తనకు మొదటగానే గుర్తొచ్చేది పి.వి.సింధు పేరేనని గాయని అనన్య పేర్కొన్నారు.

ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ప్రత్యేక గీతం కాకుండా పాట రూపొందించాలని భావించాం. దీన్ని మేం ప్రత్యేక గీతంగా చెప్పలేము. అయితే.. దానంతట అదే ప్రత్యేక గీతంగా మారుతుందని నమ్మకం ఉంది. అనన్య కొత్త తరం కళాకారిణి. ఆమె పాటలు నేనూ వింటున్నాను. ఆమె గొంతు నాకు చాలా ఇష్టం. ఈ పాట కోసం సమయం తీసుకొని చాలా చర్చించాం. నాలుగైదు ట్యూన్లు ఆమెకు పంపించాను. ఆమెకు నచ్చిన దానితోనే ముందుకు వెళ్లాం. తమిళనాడు నుంచి కొంతమంది క్రీడాకారులు టోక్యో వెళుతున్నట్లు నాకు తెలిసింది. వాళ్లను నేను కచ్చితంగా గుర్తుపట్టగలను. అందరికీ నా శుభాకాంక్షలు’’ అని రెహమాన్‌ అన్నారు.

రచయిత, గాయని అనన్య స్పందిస్తూ.. ‘‘ఒలింపిక్స్‌లో మన జాతీయ జెండా మోసేది పి.వి.సింధు. అది నిజంగా అద్భుతమైన అవకాశం. క్రీడాకారిణిగా ఆమెకు ఎంతో ఘనమైన రికార్డు ఉంది. అథ్లెట్లందరూ మనలో స్ఫూర్తి నింపేవాళ్లే. అయితే.. నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి పి.వి. సింధు. ఇక ఈ పాట గురించి చెప్పాలంటే.. చాలా దేశాలు తమ క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రత్యేకంగా పాట రూపొందించాయి. క్రీడాకారుల కోసం ఎలాగైనా ఒక పాట రాసి అందించాలని నాకు ఆలోచన వచ్చింది. వెంటనే సంబంధిత మంత్రిత్వశాఖతో మాట్లాడాను. వాళ్లు ఒప్పుకోవడంతో ఆ వెంటనే నేను ఎ.ఆర్‌.రెహమాన్‌ సంప్రదించాను. మొదట ఆయన ఎలా స్పందిస్తారో అనే విషయం గురించి ఆలోచించలేదు. మొత్తానికి మా పాట ప్రారంభమైంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు