కృష్ణవంశీ ‘అన్నం’.. రెహమాన్ సంగీతం‌..!

ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి సినిమాలతో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణవంశీ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల ‘అన్నం’ పేరుతో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Published : 17 Mar 2021 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి సినిమాలతో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణవంశీ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల ‘అన్నం’ పేరుతో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తీయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే.. అవి కేవలం పుకార్లంటూ కృష్ణవంశీ స్పష్టం చేశారు. కాగా.. ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. ఇవన్నీ ఇలా ఉండగా.. మరో ఆసక్తికరమైన వార్త ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు లెజెండరీ సంగీత దర్శకులు ఎఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లోనైనా నిజం ఉందో తెలియాలంటే కృష్ణవంశీ లేదా రెహమాన్‌ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌ వర్కౌట్‌ అయితే మాత్రం సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం అనవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని