శంకర్‌-చెర్రీ మూవీ: స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌?

త్వరలోనే ఏఆర్‌ రెహమాన్‌ డైరెక్టు తెలుగు మూవీకి స్వరాలు సమకూర్చనున్నారా? ఒక వేళ అది శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబోలో వస్తున్న చిత్రమైతే! ఆహా ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానుల అడిగిన ప్రశ్నకు

Updated : 11 Mar 2021 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏఆర్‌ రెహమాన్‌ నేరుగా ఓ తెలుగు మూవీకి స్వరాలు సమకూర్చనున్నారా? అదీ శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబోలో వస్తున్న చిత్రమైతే! ఆహా ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నకు రెహమాన్‌ ఇచ్చిన సమాధానం చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్విటర్‌లో ఒక అభిమాని రెహమాన్‌ని ప్రశ్నిస్తూ ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ ఎప్పుడు వస్తుంది’ అని అడిగారు. అందుకు ‘త్వరలోనే’అని సమాధానమిచ్చిన రెహమాన్‌ స్మైలీ సింబల్‌ పోస్ట్‌ చేశారు.

ఇప్పుడీ ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మామూలుగా శంకర్‌ డైరెక్ట్‌ చేసే చాలా చిత్రాలకు ఏఆర్‌ రెహమానే సంగీతం అందిస్తారు. ఇప్పుడీ ఈ సమాధానంతో శంకర్‌-చెర్రీల సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. ఒకవేళ ఆయన్నే చిత్రబృందం నిర్ణయిస్తే రెహమాన్‌ వరల్డ్‌క్లాస్‌ మ్యూజిక్‌కు, శంకర్‌ టేకింగ్‌కు రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌ తోడైతే వెండితెరపై పండగ వాతావరణమే. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన నేపథ్యంలో కథ ఉండనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా 2022లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రబృందం చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని