AR Rahman Daughter: వివాహబంధంలోకి ఏఆర్‌ రెహమాన్‌ కుమార్తె.. వరుడు ఎవరంటే?

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పెద్దమ్మాయి ఖతిజా రెహమాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Published : 04 Jan 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌(AR Rahaman) పెద్దమ్మాయి ఖతిజా రెహమాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదే విషయాన్ని ఖతిజా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆ దేవుడి ఆశీర్వాదాలతో.. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆడియో ఇంజినీర్‌, పారిశ్రామికవేత్త రియాస్దీన్ షేక్ మహమ్మద్‌తో డిసెంబర్‌ 29న నిశ్చితార్థం జరిగింది. అదే రోజు నా పుట్టిన రోజు కావడం మరింత సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్‌ చేశారు.

కేవలం ఏఆర్‌ రెహమాన్‌ తనయగా కాకుండా తన గాత్రంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఖతిజా. 2010లో శంకర్‌- రజనీకాంత్‌ చిత్రం ‘రోబో’లో ‘ఓ మరమనిషి’ పాటను సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన కృతిసనన్‌ ‘మీమీ’ చిత్రంలో ‘రాక్‌ఏ బై బేబీ’ పాటను పాడారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌తో పాటు గాయకులు సిధ్‌శ్రీరామ్‌, హరి చరణ్‌, నీతీ మోహన్‌, జోనితా గాంధీ తదితరులు ఖతీజా- రియాస్దీన్ షేక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు