విజయ్‌ సినిమా కోసం పాన్‌ వరల్డ్‌ సాంగ్‌ సిద్ధం చేసిన అనిరుధ్

తమిళంతో పాటు ఇతర భాషా చిత్రాలకూ సంగీతం అందిస్తూ అలరిస్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌.

Published : 08 Feb 2022 20:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళంతో పాటు ఇతర భాషా చిత్రాలకూ సంగీతం అందిస్తూ అలరిస్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌. ప్రస్తుతం పలు భారీ బడ్జెట్‌ చిత్రాలకు సంగీతం అందించే పనిలో ఉన్నారు. అందులో విజయ్‌ ‘బీస్ట్‌’ ఒకటి. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ క్రమంలో విజయ్‌ అభిమానులను అలరించేలా ఓ తీపి కబురు చెప్పింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. ‘అరబిక్‌ కుతు’ అంటూ సాగే పాటను రికార్డు చేశారు. ఈ సందర్భంగా నటుడు శివ కార్తికేయన్‌, దర్శకుడు నీల్సన్‌, అనిరుధ్‌ల హంగామా నవ్వులు పంచుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని