Beast: ఉర్రూతలూగించిన ‘అరబిక్‌ కుతు’.. తెలుగు వెర్షన్‌ వచ్చేసింది

శ్రోతల్ని ఉర్రూతలూగించిన  ‘అరబిక్‌ కుతు’ (హలమితి హబీబో) తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. విజయ్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని గీతమిది.

Published : 05 Apr 2022 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలై శ్రోతల్ని ఉర్రూతలూగించిన ‘అరబిక్‌ కుతు’ (హలమితి హబీబో) (Halamithi Habibo) తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. విజయ్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘బీస్ట్‌’ (Beast) చిత్రంలోని గీతమిది. ఏప్రిల్‌ 13న తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు పాట రిలీజైంది. శ్రీ సాయికిరణ్‌ సాహిత్యం అందించగా అనిరుధ్‌, జోనితా గాంధీ ఆలపించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన తమిళ్‌ వెర్షన్‌ (Arabic Kuthu).. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వీక్షణలు సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలిచింది. భాష అర్థమవకపోయినా క్యాచీ పదాలు, విజయ్‌, పూజా స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని