Arabic Kuthu: విజయ్‌ వాలంటైన్స్‌ గిఫ్ట్‌.. ఉర్రూతలూగిస్తున్న ‘అరబిక్‌ కుతు’ గీతం

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’.

Updated : 14 Feb 2022 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. పూజా హెగ్డే కథానాయిక. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలోని తొలి గీతం ప్రేమికుల రోజు సందర్భంగా సోమవారం విడుదలైంది. సంగీతానికి భాష అవసరం లేదని ఎన్నో పాటలతో నిరూపించిన అనిరుధ్‌ మరోసారి తన సత్తా చాటారు. తానే స్వయంగా ఈ గీతాన్ని ఆలపించి అదుర్స్‌ అనిపించారు. గాయని జోనితా గాంధీతో శ్రుతి కలిపారు. ఈ పాటను యువ నటుడు శివ కార్తికేయన్‌ రచించారు. విజయ్‌, పూజా డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ కామెడీ- యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 14న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని