Aranya: రానా ‘అరణ్య’ స్ట్రీమింగ్‌ ఆ ఓటీటీలోనే!

విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న నటుటు రానా. ఆయన కీలక పాత్రలో నటించిన

Updated : 30 Aug 2022 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న నటుడు రానా. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.  కరోనా పరిస్థితులు కూడా సినిమాపై ప్రభావాన్ని చూపాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయదశమి కానుకగా అక్టోబరు 15 నుంచి జీ5 వేదికగా ‘అరణ్య’ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమా కథేంటి? విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌వి. అక్కడ త‌ర‌త‌రాలుగా ఏనుగుల్ని ర‌క్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు న‌రేంద్ర ‌భూప‌తి (రానా). అడ‌వి, ఏనుగుల ర‌క్షణ కోసం పాటు ప‌డుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రప‌తి పుర‌స్కారం కూడా అందుతుంది. కేంద్రమంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం (అనంత్ మ‌హ‌దేవ‌న్‌) చిల‌క‌ల‌కోన అడ‌విపై క‌న్నేస్తాడు. అక్కడ డీ.ఎల్‌.ఆర్ టౌన్‌షిప్ క‌ట్టేందుకు రంగంలోకి దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా క‌ట్టేస్తాడు. మ‌రి అడ‌వినే న‌మ్ముకున్న ఏనుగులు, అర‌ణ్య...  కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేశారు?అడ‌విని ఎలా దక్కించుకున్నారన్నది కథ. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రలు పోషించారు. శాంతను సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని