రానా ‘అరణ్య’ ట్రైలర్‌

సినిమా.. సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. ఈసారి ఓ సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరణ్య’. ఏనుగుల అవసరాలు, మనుషుల దురాశకు మధ్య జరిగే పోరాట

Updated : 06 Mar 2021 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా.. సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. ఈసారి ఓ సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరణ్య’. ఏనుగుల అవసరాలు, మనుషుల దురాశకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ఏనుగులను రక్షించే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ తెలుగు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘ఏనుగులు మనకంటే ఎంతో తెలివైనవి. ఎంతో భావోద్వేగం కలవి..’ అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ఇందులో కొంతమంది తమ స్వార్థం కోసం ఏనుగులను బంధించిన తర్వాత ‘అయ్యో..! ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిందే’ అంటూ రానా అవేదనతో చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగులో ‘అరణ్య’ పేరుతో వస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లోనూ అలరించనుంది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని