అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Published : 15 Feb 2022 12:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. అంతేకాదు, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగానూ రజనీకి పేరుంది. కానీ, ఆ దర్జాలూ, విలాసాలూ సినిమాలకే పరిమితం. నిజ జీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని అభిమానులందరికీ తెలుసు. కానీ, అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే.

అది ‘దళపతి’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయం. అరవిందస్వామికి అప్పుడప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒక రోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత అది రజనీకాంత్‌ ఉండే గది అని తెలియక లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆ గదిలో ఏసీ ఆన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న మంచపై పడుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించారు. ఒక్కసారిగా గుండెలు గుభేలుమన్నాయి. నిద్రమత్తు ఒక్క దెబ్బకు వదిలిపోయింది. కంగారుగా బయటికి వెళ్లి యూనిట్‌ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... ‘‘నిన్న రాత్రి షూటింగ్‌ అయ్యాక మీరు వచ్చి రజనీ సర్‌ గదిలో ఆయన మంచం మీద పడుకొన్నారు. మిమ్మల్ని చూసి ‘అతన్ని లేపొద్దు. అక్కడే పడుకోనీయండి’ అని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి ఆయన కూడా అక్కడే నేల మీద పడుకున్నారు’’ అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం అరవింద స్వామివంతైంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని