అర్ధ శతాబ్దపు ఎర్రని సూరీడా...!

కార్తీక్‌రత్నం, కృష్ణప్రియ, నవీన్‌చంద్ర, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’ (ది డెమోక్రెటిక్‌ వైలెన్స్‌ అనేది ఉపశీర్షిక). రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా  ‘‘ఎర్రానీ సూరీడే’’ అంటూ సాగే పాటను ప్రముఖ యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈరోజు ఆవిష్కరించారు.

Published : 12 Mar 2021 18:41 IST

హైదరాబాద్‌: కార్తీక్‌రత్నం, కృష్ణప్రియ, నవీన్‌చంద్ర, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’ (ది డెమోక్రెటిక్‌ వైలెన్స్‌) అనేది ఉపశీర్షిక. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా  ‘‘ఎర్రానీ సూరీడే’’ అంటూ సాగే పాటను ప్రముఖ యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈరోజు ఆవిష్కరించారు. ఈ పాటలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని, శ్రమజీవుల కష్టాల్ని , కులవృత్తుల గురించి ప్రస్తావించారు. పాటకి లక్ష్మి ప్రియాంక సాహిత్యం సమకూర్చగా  మోహన భోగరాజు ఆలపించారు. నౌఫల్‌రాజా సంగీతం అందించారు. వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో రిషిత శ్రీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌, టీజర్‌, పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మార్చి 26న సినిమా ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదల కానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని