Panchathantram: విజయ్‌ దేవరకొండ షేర్‌ చేసిన మెలోడి

పంచతంత్రం మెలోడి విన్నారా

Published : 04 Apr 2022 16:22 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్‌ చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ‘పంచతంత్రం’ నుంచి ఓ మెలోడిని నటుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘అరెరె అరెరె’ అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ పాటను విడుదల చేయడం తనకెంతో ఆనందంగా ఉందని విజయ్ తెలిపారు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. నరేశ్‌ ఆగస్త్య, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, దివ్య శ్రీపాద, సముద్రఖని, స్వాతి తదితరులు ఈసినిమాలో కీలకపాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని