Colour Photo: సుహాస్‌, చాందిని డ్యాన్స్ క‌ష్టం చూశారా!  

తెరపై బొమ్మ చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కులు ఎంత ఆనందిస్తారో.. తెర వెన‌క జ‌రిగిన విష‌యాలు తెలుసుకునేందుకు అంతే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అందుకే ఆయా చిత్ర బృందాలు కీల‌క సన్నివేశాలు, పాట‌ల‌కు సంబంధించిన మేకింగ్ వీడియోలు పంచుకుంటాయి.

Published : 30 May 2021 01:37 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  తెరపై బొమ్మని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కులు ఎంత ఆనందిస్తారో.. తెర వెన‌క జ‌రిగిన విష‌యాలు తెలుసుకునేందుకు అంతే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అందుకే ఆయా చిత్ర బృందాలు కీల‌క సన్నివేశాలు, పాట‌ల‌కు సంబంధించిన మేకింగ్ వీడియోలు పంచుకుంటాయి. తాజాగా ‘క‌ల‌ర్ ఫోటో’ చిత్రంలోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌లైంది. సుహాస్‌, చాందిని చౌద‌రి జంట‌గా న‌టించిన చిత్ర‌మే ‘క‌ల‌ర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌కుడు. గ‌తేడాది ఓటీటీ ఆహాలో విడుద‌లై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ ప్రేమ క‌థా చిత్రం. ఇందులోని పాట‌ల‌కూ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఆ జాబితాలో నిలిచిన అరెరె ఆకాశంలోన అనే గీతాన్ని తెర‌పైకి ఎలా తీసుకొచ్చారో తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేసింది ఆహా సంస్థ‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో ఈ హుషారైన గీతానికి స్టెప్పులు ఎలా వేయాలో నాయకానాయిక‌ల‌కు చూపిస్తారు ద‌ర్శ‌కుడు. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ చూసి ఆనందించండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని