‘ఒకేఒక్కడు’లా రాజకీయాల్లో రాణించడం కష్టం- అర్జున్‌

‘ఒకే ఒక్కడు’ చిత్రంలో మాదిరిగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమైన విషయమని ‘యాక్షన్‌కింగ్‌’ అర్జున్‌ పేర్కొన్నారు. ఆయన చెల్లి కుమారుడు ధ్రువసార్జా, రష్మిక జంటగా నటించిన ‘పొగరు’ (సెమ తిమిరు) సినిమా విలేకర్ల సమావేశం చెన్నైలో....

Updated : 27 Dec 2022 19:04 IST

చెన్నై: ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో మాదిరిగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమైన విషయమని ‘యాక్షన్‌కింగ్‌’ అర్జున్‌  అన్నారు. ఆయన చెల్లి కుమారుడు ధ్రువ సార్జా, రష్మిక జంటగా నటించిన ‘పొగరు’ (సెమ తిమిరు). ‘పొగరు’ ఈ నెల 19న తెలుగుతో పాటు తమిళ, కన్నడలో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విలేకర్ల సమావేశం చెన్నైలో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 40 సంవత్సరాలు అయ్యింది. మంచిగా సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉంటున్నా. ‘మీరు రాజకీయాల్లోకి రావొచ్చుగా’ అని కొందరు అడుగుతున్నారు. నాకు ఆ అవసరం రాలేదు. అందులోనూ నేను రాజకీయాలకు సరిపోను. అంత టాలెంట్ నాకు లేదు. నిజం చెప్పాలంటే 'ఒకేఒక్కడు' తరహాలో సీఎం అయిపోయి సాధించడం అనేది నిజ రాజకీయాల్లో సాధ్యం కాదు. అందుకే రాజకీయాలపై ఆసక్తి లేదు’’ అని అర్జున్‌ చెప్పారు. కథానాయకుడు ధ్రువ మాట్లాడుతూ.. ‘‘మావయ్య అర్జున్ స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. ఆయనలా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. 'పొగరు'లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర నాది. అందుకు తగ్గట్టుగా శ్రమించి నటించా. కమర్షియల్ అంశాలన్నీ నిండుగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని