Arjun Kapoor: ‘వయోభేదం’ ట్రోల్స్‌ను పట్టించుకోను: అర్జున్‌కపూర్‌

బాలీవుడ్‌ సెలబ్రిటీలు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమాయణం బీటౌన్‌లో నిత్యం చర్చనీయాంశమే. మలైకా కంటే అర్జున్‌కపూర్‌ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. అయినా.. వీరిద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో అర్జున్‌, మలైకా ఎక్కడా కనిపించినా వారి వయోభేదం గురించే గుసగుసలు

Updated : 05 Jan 2022 07:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సెలబ్రిటీలు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోఢా ప్రేమాయణం బీటౌన్‌లో నిత్యం చర్చనీయాంశమే. మలైకా కంటే అర్జున్‌కపూర్‌ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. అయినా.. వీరిద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో అర్జున్‌, మలైకా ఎక్కడా కనిపించినా వారి వయోభేదం గురించే గుసగుసలు వినిపిస్తుంటాయి. వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడాపై కొందరు ట్రోల్స్‌ చేస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి టోల్స్‌పై పెద్దగా స్పందించని అర్జున్‌ కపూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మౌనం వీడాడు. వయోభేదం ఇబ్బంది ఏమీ కాదని, ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని వెల్లడించాడు.

‘‘బంధాలకు సంబంధించిన విషయంలో వయోభేదాన్ని అడ్డుగా చూపొద్దు. ఎవరి వయసు ఎంత అనే దాని గురించి బాధపడకూడదు. ఎవరి జీవితాలు వారివి. జీవించాలి.. జీవించనివ్వాలి. ప్రజలు చేసే కామెంట్లను మీడియా పెద్దగా చేసి చూపిస్తుంటుంది. వాటిలో 90 శాతం కామెంట్లను మేము చూడము. కాబట్టి ట్రోల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటిలో చాలా వరకు తప్పుడు సమాచారమే ఉంటుంది. ట్రోల్‌ చేసేవారే నన్ను కలిసినప్పుడు.. నాతో సెల్ఫీ దిగడానికి పడిచస్తుంటారు. అందుకే, అలాంటి వాళ్లని నమ్మకూడదు. నా వ్యక్తిగత జీవితంలో నేను చేసే ఏ పని అయినా.. అది నా హక్కు. నేను చేసే పనికి గుర్తింపు లభించినంత కాలం.. మిగతా విషయాలన్నీ నా దృష్టిలో వ్యర్థమే’’అని అర్జున్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అర్జున్‌కపూర్‌ మోహిత్‌ సూరి దర్శకత్వంలో ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’లో నటిస్తున్నారు. ఇది 2014లో వచ్చిన ‘ఏక్‌ విలన్‌’ చిత్రానికి కొనసాగింపు. ఈ చిత్రంలో అర్జున్‌ కపూర్‌తోపాటు జాన్‌ అబ్రహాం, తాగా సుటారియా, దిశా పఠానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని