Arjun Kapoor: మలైకపై వార్తలు.. అర్జున్ కపూర్ వార్నింగ్
తన ప్రియురాలు మలైకా అరోరా గురించి ఓ వెబ్సైట్లో వచ్చిన కథనంపై నటుడు అర్జున్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ముంబయి: తన ప్రియురాలు మలైకా అరోరా (Malaika Arora) తల్లి కానుందంటూ ఓ ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన కథనంపై బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఆర్టికల్ స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఆయన.. ‘‘మీరు సాధారణమైన విషయంగా భావించి రాసే ఇలాంటి పనికిరాని వార్తల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు తెలుసా? ఇలాంటి వదంతులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ విలేకరి తరచూ ఇటువంటి వార్తలనే రాస్తోంది. అవి కాస్త సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యి అందరూ వాటిని నిజాలే అని నమ్ముతున్నారు. ఇకనైనా ఇలాంటివి చేయడం మానండి. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దు’’ అని అర్జున్ కపూర్ హెచ్చరించారు.
49 ఏళ్ల మలైక.. 2017లో అర్బజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈక్రమంలోనే ఆమెకు అర్జున్ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. ఎంతోకాలం నుంచి రిలేషన్లో ఉన్న వీరిద్దరూ గతేడాది తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. మలైక ప్రెగ్నెంట్ అని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల నెట్టింటిలో పోస్టులు, కథనాలు దర్శనమిచ్చాయి. ఈవిషయంపైనే అర్జున్ సీరియస్ అయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Taraka Ratna: కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు: మంత్రి సుధాకర్
-
Movies News
Naga Chaitanya: నాగచైతన్యతో నేను టచ్‌లో లేను.. ‘మజిలీ’ నటి
-
India News
Delhi : దిల్లీకి ఖలిస్థానీ ఉగ్ర ముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
-
General News
NTR: తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం ఉంది.. వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్
-
Politics News
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర రేపు ముగింపు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు