Arjun: విశ్వక్‌సేన్.. కమిట్‌మెంట్ లేని నటుడు.. ఇది అన్‌ప్రొఫెషనలిజం: అర్జున్ అసహనం
విశ్వక్‌సేన్, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో అర్జున్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర బృందానికీ హీరో విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దర్శకుడు అర్జున్ ఇక విశ్వక్‌సేన్‌తో సినిమా చేయనని చెప్పారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్: తన 42 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎవరి గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పలేదని, కానీ, విశ్వక్‌సేన్ (vishwak sen) చేసిన పనికి బాధకలిగి నా అభిప్రాయాలను పంచుకునేందుకే ఇక్కడకు వచ్చానని సీనియర్ నటుడు అర్జున్ (Arjun Sarja) అన్నారు. ఆయన దర్శకత్వంలో విశ్వక్‌సేన్, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా చిత్ర బృందానికి, విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు రావడం మొదలయ్యాయి. తాజాగా కీలక షెడ్యూల్‌కు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ‘షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని విశ్వక్‌సేన్ సందేశం పంపడంపై అర్జున్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాత్రింబవళ్లూ ఎంతో కష్టపడి సెట్ సిద్ధం చేసిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేయమనడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. ఇక సినిమా నుంచి విశ్వక్ బయటకు వచ్చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అర్జున్ అన్నారు.
‘‘నా సినిమా తర్వాతి షెడ్యూల్ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పా. కానీ, ఆ రోజు ఉదయం 5గంటలకు నాకు విశ్వక్‌సేన్ నుంచి ఒక మెస్సేజ్ వచ్చింది. ‘సర్ ఐయామ్ సారీ. ప్లీజ్ క్యాన్సిల్ షూట్’ అని చూసే సరికి, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏ మాట్లాడాలో కూడా తెలియలేదు. కథ, క్యారెక్టర్, డైలాగ్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. నేను జీర్ణించుకోలేకపోయా. మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా. నిజంగా ఇది టెక్నీషియన్స్‌ను అవమానించడమే. ఆ తర్వాత ఆయన మేనేజర్ ‘సర్ మీతో తర్వాత మాట్లాడతా’ అని మెస్సేజ్ పెట్టారు. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే అతనికి మర్యాద లేదా? ఈ హీరోను పెట్టుకుని పెద్ద సినిమా చేద్దామని, బాగా డబ్బులు సంపాదించాలని నేను అనుకోలేదు. ఒక మంచి సినిమా చేయలనుకున్నా. ఏ ఫైనాన్సియర్ దగ్గరా డబ్బులు అడగలేదు. ఇండస్ట్రీ అంటే ఎంతో నిబద్ధత కలిగిన నటులను చాలా మందిని చూశా. జగపతిబాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన్ని డేట్స్ అడిగాను. ఆయన షెడ్యూల్ నాకు చూపించారు. అది పూర్తయిన తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి సినిమాలు లేవని చెప్పారు. ‘నా కోసం మధ్యలో రెండు రోజులు సర్దుబాటు చెయ్’ అని అడిగితే, ‘అస్సలు కుదరదు. నేను వాళ్లకు కమిట్‌మెంట్ ఇచ్చాను’ అన్నారు. అది ఒక నటుడికి ఉండాల్సిన నిబద్ధత. ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణగారిని పిలిచా. అదే రోజు అనుకుని ‘అడ్రస్ పెట్టు వస్తా’ అన్నారు. పది రోజులు తర్వాత అని చెప్పడంతో, ‘సారీ బాస్ నేను చేస్తున్న సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ని అడిగి చెబుతా’ అన్నారు. అది నిబద్ధత. సినిమా పూజా కార్యక్రమం రోజున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి, రాలేకపోయినందుకు సారీ చెప్పారు. వెంకటేశ్, చిరంజీవి ఇలా అందరూ తమ ప్రొడ్యూసర్స్‌ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్‌మెంట్. నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తారు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు కానీ, ఈ నటుడు(విశ్వక్‌సేన్) మాత్రం ‘రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని మెసేజ్‌లు పెడుతాడు’’
‘‘ఒక రోజు షూట్ అంటే ఎంత మంది కష్టం ఉంటుందో ఆలోచించండి. షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇది ఆయన గురించి చెడుగా ఆరోపణలు చేయడం కాదు. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే, నా పరపతికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని నేను అనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయదలచుకోవడం లేదు. అందుకే ఈ ప్రెస్‌మీట్. కొన్ని రోజులు పోయిన తర్వాత అతనితో కాంప్రమైజ్ అయి, ఈ సినిమా చేయను. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, చంద్రబోస్ పాటలు మనోడికి నచ్చడం లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇష్టపడటం లేదు. హీరోగా అతడు కొన్ని సూచనలు చేయొచ్చు తప్పులేదు. కానీ, ఒక మేకర్‌గా నాకు నచ్చాలి కదా! చాలా సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశా. అతడు వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. డైరెక్టర్, నిర్మాత అనే వ్యక్తులకు మర్యాద ఇవ్వాలి. అది బేసిక్. మీకు కథ నచ్చకపోతే, ‘ఈ సినిమా చేయాల్సిందే’ అని ఎవరూ బలవంతం చేయరు. ఆఖరికి ప్రొడక్షన్ బాయ్‌ను కూడా తీసుకురాలేను. ఇండస్ట్రీలో పద్ధతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందాం. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్‌తో మాట్లాడతా. ఇలా మరొకరికి జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. అంతేకానీ, దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని నాకు లేదు. నేను ఇక్కడ సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా. వివాదాలు సృష్టించడానికి కాదు. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వేరొక నటుడితో ఈ సినిమా మళ్లీ మొదలు పెడతా. ’’ అని అర్జున్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా