
Anushka: అలాంటి పాత్ర జీవితంలో ఒకసారే వస్తుంది.. అందుకే ఆ చిత్రమంటే ప్రత్యేకం!
ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది ‘అరుంధతి’. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి నేటికి 13ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క ‘అరుంధతి’ చిత్రాన్ని గుర్తుచేసుకుంది.
‘‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఏ నటికైనా లైఫ్‌టైమ్‌లో ఒకసారి మాత్రమే పోషించగల పాత్రంటూ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అది.. అరుంధతిలోని ‘జేజమ్మ’ పాత్ర. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటు చిత్ర బృందానికి నా ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
హారర్-ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రతినాయకుడు ‘పశుపతి’గా సోనూసూద్ నటించారు. ఇందులోని సోనూసూద్ పలికిన.. ‘వదల బొమ్మాళి.. వదలా’ డైలాగ్ చిత్రానికే హైలైట్. నటులు మనోరమ, కైకాల సత్యనారాయణ, షాయాజీ షిండే కీలక పాత్రలు షోహించారు. కమర్షియల్‌గా హిట్ అయిన చిత్రం.. 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను (సౌత్) దక్కించుకున్నాయి. బెంగాలీలో ‘అరుంధతి’పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.
ఇవీ చదవండి
Advertisement