Aryan Khan: యాక్షన్‌ చెప్పనున్న ఆర్యన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ మెగాఫోన్‌ చేతపట్టి యాక్షన్‌ చెప్పనున్నారు. తన తండ్రి నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌తోపాటు సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 14 Apr 2022 09:09 IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ మెగాఫోన్‌ చేతపట్టి యాక్షన్‌ చెప్పనున్నారు. తన తండ్రి నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌తోపాటు సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట వెబ్‌సిరీస్‌కు కథ రాయడంతోపాటు దర్శకత్వం వహించనున్నారని, దీనికోసం ఇటీవలే ముంబయిలోని ఓ స్టూడియోలో టెస్ట్‌షూట్‌ నిర్వహించారని బాలీవుడ్‌ మీడియా వెల్లడించింది. ఇంకా పేరుపెట్టని ఈ ప్రాజెక్టుకు పూర్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే ప్రకటించనున్నారని పేర్కొంది. ఆర్యన్‌కు నటన కన్నా దర్శకత్వంపైనే ఆసక్తి ఉన్నట్లు షారుఖ్‌ గతంలో చెప్పారు. దర్శకత్వంలో మెలకువలు తెలుసుకోవడానికి ప్రఖ్యాత సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల పాటు ఫిలిం మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నారు ఆర్యన్‌. షారుఖ్‌ కుమార్తె సుహానా ఖాన్‌ నటిగా రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లో ఆమె నటిస్తోంది. నెట్ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ఈ వెబ్‌సిరీస్‌లో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద కూడా నటిస్తుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని