Asalu movie review: రివ్యూ: అసలు
Asalu movie review: రవిబాబు, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ‘అసలు’ ఎలా ఉందంటే?
Asalu movie review; చిత్రం: అసలు; నటీనటులు: రవిబాబు, పూర్ణ, సూర్య, సత్య కృష్ణన్ తదితరులు; సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని; ఎడిటింగ్: సత్యనారాయణ బళ్లా; సంగీతం: ఎస్ ఎస్రాజేశ్; కథ, సంభాషణలు, నిర్మాత, పర్యవేక్షణ: రవిబాబు; దర్శకత్వం: ఉదయ్, సురేష్; స్ట్రీమింగ్ వేదిక: ఈటీవీ విన్
సినీ అభిమానులకు దొరికిన సరికొత్త వినోద మాధ్యమం ఓటీటీ. థియేటర్లో అలరించిన సినిమాలతో పాటు, కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. సినీ ప్రేక్షకులు సైతం ఓటీటీలో వచ్చే కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో నేరుగా విడుదలైన చిత్రం ‘అసలు’. (Asalu movie review) విభిన్న నేపథ్య కథలతో అలరించే దర్శకుడు రవిబాబు ఇందులో నటించడం, ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఈ క్రైమ్ థ్రిల్లర్ కథేంటి?
కథేంటంటే: నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ వెంకటేశ్ చక్రవర్తి (సూర్య) జూమ్ వేదికగా విద్యార్థులకు క్లాస్ చెబుతుంటాడు. ఆ సమయంలో అందరూ చూస్తుండగానే ఆ ప్రొఫెసర్‌ను ఓ ముసుగు వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేస్తాడు. సంచలనంగా మారిన ఈ హత్యను ఛేదించేందుకు సీఐడీ ఆఫీసర్ రంజిత్ (రవిబాబు)ను అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తారు. కేసు విచారణ చేపట్టిన రంజిత్ దాన్ని ఎలా ఛేదించాడు. ఈ క్రమంలో ప్రొఫెసర్ సహాయకురాలు వందన (పూర్ణ) ఏం చేసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: గత కొంతకాలంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక భాష అర్థం కాకపోయినా సబ్‌టైటిల్స్‌లో చూసి మరీ ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రవిబాబు సిద్ధహస్తుడు. ఆయన నుంచి వచ్చిన ‘అమరావతి’, ‘అవును’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈసారి ఓటీటీ కోసం ఆయన పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రమే ‘అసలు’. క్రైమ్ థ్రిల్లర్ పాయింట్‌ను ఎంచుకోవడం, వాటిని సినిమాగా రాసుకోవడం ఒకెత్తయితే, దానిని తెరపై ప్రజెంట్ చేయడం మరొకఎత్తు.(Asalu movie review) హత్యకేసు చుట్టూ తిరిగే ఆసక్తికర కథగా ‘అసలు’ను ప్రేక్షకులకు అందించడంలో దర్శకులు ఉదయ్, సురేష్‌లు కొంత విజయం సాధించారు. ప్రేక్షకుడిని ఎక్కువసేపు వేచి చూడనీయకుండా ప్రొఫెసర్ హత్యతో నేరుగా కథను మొదలు పెట్టేశారు దర్శకులు. అక్కడి నుంచి జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అన్నీ సాదాసీదాగా ఉంటాయి. హంతకుడి చుట్టూ ఉన్న వారిపై అనుమానం కలిగేలా సాగే కథనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ హత్యకు ముందు ప్రొఫెసర్‌ను నలుగురు వ్యక్తులను కలవడం, రంజిత్ వారిని విచారించడం, ప్రొఫెసర్‌తో వారికున్న వైరాన్ని చెబుతూ సాగే సన్నివేశాలు కథను ముందుకు నడపడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి.
ద్వితీయార్ధంలోనే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి కథ, కథనాలు కాస్త మెప్పిస్తాయి. అసలైన హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత ఆ హత్య ఎందుకు, ఎలా చేశారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన రంజిత్ డీకోడ్ చేస్తూ చెప్పే సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. అయితే, ఈ విషయంలో కథా రచయిత, దర్శకులు సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసేసుకున్నారు. (Asalu movie review) అంతా హంతకుడు అనుకున్నట్లే ఎలా జరుగుతుంది? అన్న ప్రశ్న సినిమా చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి జవాబు చెప్పేందుకే అన్నట్లు, సినిమాను ఇంకాస్త పొడిగించి, ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించేలా ఎయిర్పోర్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను జోడించారు. ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని, నిడివి విషయంలో చిత్ర బృందం చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంది. (Asalu movie review) పాటలు, ఇతర అనవసర సన్నివేశాలకు జోలికి పోకపోవడం కాస్త ఉపశమనం.
ఎవరెలా చేశారంటే: ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంజిత్ పాత్రలో దర్శకుడు, నటుడు రవిబాబు కనిపించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. చాలా సులువుగా చేసుకుంటూ వెళ్లిపోయారు. వందనగా పూర్ణ బాగానే చేశారు. ప్రొఫెసర్‌గా నటించిన సూర్య పాత్రలోనే కాస్త షేడ్స్ ఉన్నాయి. ఆ పాత్రకు ఆయన న్యాయం చేశారు. (Asalu movie review) మిగిలిన వాళ్లు తమ పరిధిమేరకు నటించారు. ఎస్ ఎస్ రాజేశ్ సంగీతం ఓకే. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఈ వీకెండ్లో ఏదైనా మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలంటే ‘అసలు’ ప్రయత్నించవచ్చు. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఇంటిల్లిపాదీ చూసేలా సినిమాను తీర్చిదిద్దారు. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది.
బలాలు: + రవిబాబు, పూర్ణ, సూర్య; + ద్వితీయార్ధం
బలహీనతలు: - రొటీన్ క్రైమ్ డ్రామా; - బలమైన ఎమోషన్స్ లేకపోవడం
చివరిగా: ద్వితీయార్ధంలోనే ‘అసలు’ విషయం!(Asalu movie review)
చివరిగా: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్