Tollywood: ఇంటివాడైన నటుడు ఆశిష్‌

‘నాటకం’ చిత్రంలో విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆశిష్‌ గాంధీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నిఖిత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు.....

Published : 04 Jun 2021 19:43 IST

హైదరాబాద్‌: ‘నాటకం’ చిత్రంలో విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆశిష్‌ గాంధీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నిఖిత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కాగా, తాజాగా వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ‘నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది’ అని ఆశిష్‌ తెలిపారు. మరోవైపు ఆశిష్‌ ప్రస్తుతం ‘డైరెక్టర్‌’, ‘ఉనికి’తోపాటు మరో ప్రాజెక్ట్‌లో సైతం కథానాయకుడిగా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని